పూలే విగ్రహం వద్ద కూర్చొని నిరసన

మోర్తాడ్, బతుకమ్మ: బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో బీసీ సంఘాలు ఇచ్చిన బందుకు  మద్దతు గా మోర్తాడ్ మండలంలోని నాయకులు, యువకులు పూర్తి మద్దతు తెలిపారు. మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో అందరు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అందరూ నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.  కార్యక్రమంలో గురిజాల నర్సయ్య, బిల్లాల శ్రీనివాస్, మెంచు నర్సారెడ్డి, పుప్పాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.