Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2024, 11:02 am Posted by : ramakrishna

రోడేక్కి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల నిరసన

 

. . . రీయేంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ తాత్సారం

. . . కళాశాలల నిరవధిక బంద్  పాటిస్తున్న యాజమాన్యాలు

. . . జిల్లా కేంద్రంలో భారీ మానవహారం తో నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..

ప్రైవేట్ కళాశలలా ఫీజు రీయెంబర్స్ మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రోడెక్కింది. గత మూడు రోజులుగా నిరవధికంగా కళాశాలల బంద్ నిర్వహిస్తున్న యాజమాన్యం అసోసియేషన్  ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద బుదవారం మానవహారం ధర్నా నిర్వహించారు. నిరసన సంధర్బంగా ప్రైవేట్‌ కళాశాలల అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి ప్రసాద్, కో-ఆర్డినేటర్‌ నరాల సుధాకర్‌ లు మాట్లాడుతూ..విద్యార్థులకు మూడేండ్ల నుంచి ఉపకార వేతనాలు రావడంలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నామని తెఆందోళన వ్యక్తం చేసారు.ఆర్థిక కారణాలతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే లక్ష్యంతో ప్రవేశపెట్టి బోధనా రుసుముల చెల్లింపు పథకం పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు. విద్యార్థులను ఫీజులు అడగలేక ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు పొందలేక, భవన అద్దె, జీతభత్యాలు, నిర్వహణ వ్యయం భరించలేక, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరకు మూసి వేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించే స్థాయికి ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు చేరుకున్నాయనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ,పీజీ కళాశాలలు పాల్గొన్నారు.

 

Protest by private college owners at Rodeki