Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:02 pm Posted by : ramakrishna

ఢిల్లీలో విద్యార్థి, యువతపై కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు నిరసన

 

. . . నిరసనలో పాల్గొన్నా బాన్సువాడ బీఆర్ఎస్వి నాయకులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత విధానాలకు నిరసనగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వి) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా మాట్లాడుతూ, విద్యార్థులు, యువత హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడ రాంచందర్, మొగులయ్య, పోచారం నరేష్, ఆరిఫ్, పండిత్, పోచారం శ్రీనివాస్ జాదవ్, శేఖర్, సాయిలు, అనిల్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.