నిజాంసాగర్, బతుకమ్మ : కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం సవరిస్తూ గాంధీ ఫొటో, పేరు తొలగింపుపై నాయకులు నిరసన తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఆదివారం నిజాంసాగర్ మండలకేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని మల్లికార్జున్ అన్నారు. ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
