- బీబీపేట ఎంపీడీవో పూర్ణ చంద్రకుమార్
మాచారెడ్డి, బతుకమ్మ: ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా బీబీపేట ఎంపీడీవో పూర్ణ చంద్రకుమార్ ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. బీబీపేటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బందికి ఎండల నుంచి రక్షించే ముందస్తు చర్యలపై సూచనలు చేశారు. ఎండలు 36 డిగ్రీల పైన ఉన్నందున తొందరగా పనులకు వచ్చే విధంగా చూడాలని, గుల్కోస్ ప్యాకెట్లు కూలీలకు పంపిణీ చేయాలన్నారు. పని జరిగే చోట టెంటు, తాగునీటి వసతులు కల్పించాలన్నారు. డాక్టర్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు వచ్చినా అక్కడే పరిష్కారం కావాలన్నారు . అలాగే ఉపాధి పనులు చేసే వారికి పనిముట్లు పార, గడ్డపారలు టెంట్లు వచ్చే విధంగా చూడాలని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.