Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2024, 5:07 pm Posted by : ramakrishna

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  న్యాయవాదుల  సమస్యలు పరిష్కరించాలని, రక్షణ చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాదులు కోరారు. ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్ పిలుపుమేరకు సోమవారం రోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని తీర్మానించారు అనంతరం జిల్లా కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,   న్యాయవాదులు సురేశ్, పిల్లి శ్రీకాంత్, ఎర్రం గణపతి, వి భాస్కర్, శ్రీధర్, విశ్వక్ సేన్, ఆశ నారాయణ, భిక్షపతి, శివాజీ భోస్లే, సాయన్న, జైపాల్, మహిళా న్యాయవాదుల కవితారెడ్డి, అంజలి  తదితరులు పాల్గొన్నారు.