నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వృద్ధాప్యంలో కళ్ళను కాపాడుకోవడం చాలా ముఖ్యమని సీనియర్ సిటిజన్లకు ,పెన్షనర్లకు ఐస్క్రీనింగ్ టెస్ట్ ను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయం అని ప్రముఖ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ జోషి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ లోని ఆల్ పెన్షనర్స్, సీనియర్ సిటిజెన్స్ భవన్ లో అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఐ క్యాంపునకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురు పెన్షనర్లకు ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఈవిల్ నారాయణ, ఎండి హమీదుద్దీన్, సాంబశివరావు, మేరీ, లక్ష్మీ నారాయణ, లావు వీరయ్య, రైసుద్దీన్, సిర్ప లింగయ్య, మధుసూదన్, అగర్వాల్ హాస్పిటల్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. దాదాపు 140 మంది పెన్షనర్లకు ఈ సందర్భంగా వివిధ రకాలైన టెస్టులను నిర్వహించారు.
