. . . సర్పంచ్ లోకని గంగామణి గంగారం
ఇందల్వాయి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళ సంఘాల సభ్యులు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇందల్వాయి సర్పంచ్ లోకని గంగామణి గంగారం సూచించారు. ఈ మేరకు మంగళవారం గ్రామ సచివాలయం ముందు డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డ్వాక్రా సంఘం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కల సంరక్షణ భావితరాలకు వరమని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు వనమహోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని నీటి వృధాను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ రియాజ్, వైస్ చైర్మన్ బాగిర్తి నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భరత్, కరోబార్ పోచయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ జగ్గా రాములు, తదితరులు పాల్గొన్నారు.