Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 6:38 pm Posted by : ramakrishna

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత

 

. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యతని, కామారెడ్డి లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు నిర్వహించిన దాడి ఘటన నేపథ్యంలో సోమవారం ఆయన నివాసానికి వెళ్లి అర్బన్ ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడడం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయనకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

 

Protecting democracy is the responsibility of every politician.