Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 4:09 pm Posted by : ramakrishna

రావుట్ల శివారు ఆటవి భూములు కబ్జా కాకుండా కాపాడండి

 

… కలెక్టరేట్  లో నిరసన తెలిపిన  రావుట్ల గ్రామస్థులు

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

సిరికొండ మండలం రావుట్ల శివారులోని ఆటవి భూములతో పాటు పట్టా భూములను పోడు సాగు పేరిట కబ్జా చేస్తున్నారు వాటిని కాపాడాలని రావుట్ల గ్రామస్థులు నిజామాబాద్ కలెక్టరేట్ లో నిరసన తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడి ఓసి కి తరలివచ్చి  జిల్లా కలెక్టర్ కు ఆటవి  భూములు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ….తమ గ్రామ శివారులో భూములు అన్యాక్రాంతం పై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని తొలకరికి ముందే చెట్లను నరికి పంటల సాగు కోసం సిద్ధం చేస్తున్నారని రైతులు వాపోయారు. జంగిలోడి తండాకు చెందిన వ్యక్తులు రావుట్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వేసవి నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంటే ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. తమ గ్రామ శివారు ప్రాంతంలో రక్షిత ఆటవి ప్రాంతంలో జరుగుతున్న ఆటవి భూముల ఆక్రమణలు అడ్డుకోకపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ అటవి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో ఆటవి, రెవెన్యూ, పోలీస్ శాఖ సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమణలు జరుగకుండా కందకాలు తవ్వుతామని తెలిపారు.

Protect the wild lands of the suburbs of Raotu from being encroached upon