పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి
ఏడిఈఎన్ హెచ్ ఎం.బబ్లు నిజామాబాద్ , బతుకమ్మ : చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్పబహుమతి అని,పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు మేలు చేయటమే గాక వారికి ఆదర్శంగా నిలవాలని ఏడిఈఎన్ హెచ్ ఎం బబ్లు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడలో భాగంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం తో పాటు ర్యాలీ ప్రతిజ్ఞ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ రైల్వే డివిజన్ ఏడిఈఎన్ హెచ్...