Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2024, 6:24 pm Posted by : ramakrishna

పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలి

ఏడిఈఎన్ హెచ్ ఎం.బబ్లు
నిజామాబాద్ , బతుకమ్మ : చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్పబహుమతి అని,పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు మేలు చేయటమే గాక వారికి ఆదర్శంగా నిలవాలని ఏడిఈఎన్ హెచ్ ఎం బబ్లు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వాడలో భాగంగా అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం తో పాటు ర్యాలీ ప్రతిజ్ఞ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  హైదరాబాద్ రైల్వే డివిజన్ ఏడిఈఎన్ హెచ్ ఎం బబ్లు, నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ సిబ్బంది చేత స్వచ్ఛత పక్వాడ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్ రైల్వే డివిజన్ ఏడిఈఎన్ హెచ్ ఎం బబ్లు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించటం మనందరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుని ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని, ఈ దిశగా అమ్మ పేరిట ఒక మొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేయటంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.