గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఇలా త్రిపాఠితో, ఇతర జిల్లా అధికారులతో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.  ...