Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 10:14 pm Posted by : ramakrishna

మల్టీ జోన్ వన్ పరిధిలో పోలీస్ స్టేషన్ ల అప్ గ్రేడ్ కు ప్రతిపాదనలు

హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్ వన్ లోని పోలీస్ స్టేషన్ ల అప్ గ్రేడ్ కు ప్రతిపాదనలు పంపాలని జోన్ వన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ కమిషనరేట్ తో పాటు రామగుండం, కరీంనగర్, సిద్దిపేట్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేష న్ ల ప్రతిపాదనలు పంపాలని ఆయా పోలీస్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ పోలీస్ కమిషనరేట్లతోపాటు తో పాటు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ ,జగిత్యాల్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల పోలీస్ స్టేషన్ స్థాయిని పెంపుదలకు జిల్లా ఎస్పీ ల నుంచి ప్రతిపాదనలను కోరారు. కొత్తగా సబ్ డివిజన్ ల ఏర్పాటు, సర్కిల్ కార్యాలయాలు ,ట్రాఫిక్ పిఎస్ లు, మహిళా పోలీస్ స్టేషన్ లు, కొత్తగా ఏర్పడిన మండలాల పోలీస్ స్టేషన్ ల ఏర్పాటుతోపాటు గతంలో ఉన్న పోలీస్ స్టేషన్లను ఎస్హెచ్ఓ స్థాయికి పెంపోoదించడానికి ప్రతిపాదనలను కోరారు. దాదాపు 66 పోలీస్ స్టేషన్ లను ఎస్ హెచ్ ఓ స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలను కోరినట్టు సమాచారం. నిజామాబాద్ రూరల్ సబ్ డివిజన్ ఏర్పాటు కాయం కానుంది. పెద్ద పోలీస్ స్టేషన్లో సిఐ సాయి అధికారులను నియమించే అవకాశం ఉంది.