పక్కాగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి
లోలం గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఇందల్వాయి,బతుకమ్మ : సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి...