గ్రామ, వార్డు సభల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 నుండి పై పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన...