ప్రజావాణి దరఖాస్తులకు సత్వర చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను పరిశీలించి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, తన పరిధిలో లేని సమస్యలపై ఉన్నతాధికారులకు విన్నవించాలని సూచించారు. ఈ రోజు వివిధ శాఖలకు చెందిన (67) అర్జీలు రావడం జరిగాయని తెలిపారు....