పల్లె పల్లెకు న్యాయవిజ్ఞానం ప్రచారం..
నిజామాబాద్ అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ బోధన్, బతుకమ్మ : భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అవిరళ కృషి చేస్తున్నదని నిజామాబాద్ అదనపు జిల్లాజడ్జి టి. శ్రీనివాస్ తెలిపారు.బోధన్ మండలం నాగన్ పల్లి గ్రామంలో న్యాయసేవ సంస్థ ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రతి చట్టం ప్రజల ప్రగతి కోసం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభలు తయారు చేస్తాయని అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి...