ఎంప్లాయిస్ కు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ బకాయి పడిన నాలుగు వాయిదాల కరవుభత్యాలను, జూలై 2023 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని అడగొద్దని అవి కావాలంటే నెలనెలా జీతాలే ఇవ్వలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించటాన్ని టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, వారికి న్యాయంగా రావాల్సిన బకాయిలను లేదా వారు దాచుకున్న సొమ్మును వారికి తిరిగి  చెల్లించాలని మాత్రమే అడుగుతున్నారని ఆయన స్పష్టం చేశారు....