Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 5:38 pm Posted by : ramakrishna

ఆటో డ్రైవర్స్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చలీ

  • ఏఐటీయూసీ డిమాండ్

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ డివిజన్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం ఆర్మూర్ పట్టణంలోని  మిలన్ పంక్షన్ హల్ లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డు తో పాటు ప్రతి సంవత్సరము 12 వేల రూపాయలు ఇచ్చి ఆడుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికి  హామీని నిలబెట్టడం లేదని తక్షణమే ఆటో డ్రైవర్స్ కు ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఆయన అన్నారు.. గ్రామానికి ఇద్దరి చొప్పున  64 మందితో ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీతో పాటు 20 మంది యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం లో. బక్కన్న. శుభాష్. శ్రీనివాస్.గురువయ్య. రమేష్. రాజేశ్వర్. మహేష్. తదితరులు పాల్గొన్నారు.