వలస కుటుంబాల జీవనోపాధి బలోపేతానికి ఎంఎంపిటిఎఫ్ కార్యక్రమం పురోగతి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   వలస కుటుంబాల స్థితిస్థాపకతను పెంపొందించడం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం, సురక్షిత వలసలకు మద్దతు అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న మైగ్రేషన్ మల్టీ-పార్టనర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపిటిఎఫ్) జాయింట్ ప్రోగ్రామ్ కింద 3వ జిల్లా స్థాయి కమిటీ (డిఎల్ సి) సమావేశం గురువారం నిజామాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) సి.వి. భుజంగరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎఫ్ఎఓ, ఐఓఎం ప్రతినిధులు ప్రాజెక్టు పురోగతిని వివరించారు. సిరికొండ, ధర్పల్లి మండలాల్లోని...