నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేష్

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ కితాబు   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ.గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన రెండు నెలల నుంచి ఇళ్ల నిర్మాణాలలో జిల్లా గణనీయమైన వృధ్ధి సాధించిందని, రెండవ విడత ఇళ్ల మంజూరీ, గ్రౌండింగ్ లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిని, సంబంధిత...