రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాంబాబుకు సన్మానం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డ్ పొందిన ప్రో. రాంబాబు గోపిశెట్టి ని వైస్-ఛాన్సెలర్ ప్రో.టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి సమక్షంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ శాలువ, మెమొంటో, పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా. ఏ. పున్నయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ప్రొఫెసర్ రాంబాబు గారు ఉన్నతమైన బోధనతోపాటు అత్యున్నతమైన పరిశోధకులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు...