నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డ్ పొందిన ప్రో. రాంబాబు గోపిశెట్టి ని వైస్-ఛాన్సెలర్ ప్రో.టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి సమక్షంలో తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ శాలువ, మెమొంటో, పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా. ఏ. పున్నయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ప్రొఫెసర్ రాంబాబు గారు ఉన్నతమైన బోధనతోపాటు అత్యున్నతమైన పరిశోధకులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందినారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ మోహన్ బాబు మాట్లాడుతూ పారదర్శకంగా రాంబాబు గారిని ఉత్తమ అధ్యాపక అవార్డును ఎంపిక చేసి ఉన్నత విద్యాశాఖకు పంపినందుకు విశ్వవిద్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అడికే నాగరాజు, డాక్టర్ శిరీష, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ జమీల్, డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ సంపత్, డాక్టర్ ఎల్లోసా, డాక్టర్ హరిత, డాక్టర్ అంజయ్య, డాక్టర్ ప్రతిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.