Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 5:56 pm Posted by : ramakrishna

తె యూ తెలుగు విభాగాతిపతిగా ప్రొఫెసర్ పి. కనకయ్య నియామకం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి. కనకయ్యను నియమించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి తెలిపారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి.కనకయ్య గతంలో అడ్మిషన్ పదవులు నిర్వహించేవారని ఆయనన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తనను అభినందించిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు.