పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ సిద్ధాంతకర్త, కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతి వేడుకలను నిజామాబాద్ పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1934...