- ప్రిన్సిపల్ డా.ప్రవీణ్ మామిడాల
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ అని ప్రిన్సిపల్ డా.ప్రవీణ్ మామిడాల అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ అని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ.పున్నయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు గొప్ప రాజకీయ సిద్ధాంతాన్ని అందించిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమాన్ని విడదీసి మాట్లాడలేమన్నారు. ఈ కార్యక్రమన్ని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి సమన్వయం చేయగా ప్రొఫెసర్ రాంబాబు గోపిశెట్టి, ప్రొఫెసర్ విద్యావర్ధిని, ప్రొఫెసర్ అరుణ, డాక్టర్ జమీల్, డా. పాత నాగరాజు, డాక్టర్ సంపత్ డాక్టర్ సమత తదితర టీచింగ్ నాన్ టీచింగ్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు పరిశోధకులు జయశంకర్ చిత్రపటానికి పూలు అర్పించి ఘనమైన నివాళి అర్పించారు.
