ప్రొ. కోదండరామ్ ను కలిసిన తెలంగాణ ఉద్యమ కారుడు

బతుకమ్మ, రుద్రూర్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొ. కోదండరామ్ ను హైదరాబాద్ లోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలం అంబం గ్రామ వాసి తెలంగాణ ఉద్యమకారుడు జెజ్జరి నాగనాధ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీ గా పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.