నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఫోరెన్సీక్ హెడ్ ప్రొఫెసర్ డా.నాగమోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొన్నటి వరకు ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న నాగమోహన్ కు ఇంచార్జి సూపరింటెండెంట్ గా నియమిస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ ఇంచార్జి సూపరింటెండెంట్ గా పని చేసిన శ్రీనివాస్ స్థానంలో నాగమోహన్ ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. డా.నాగమోహన్ ను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తో పాటు జీజీహెచ్ డిప్యూటీ సూపరిండెంటెంట్లు, ఆర్ఎంవోలు, సీనియర్ రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ పెద్దోళ్ళ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది నాగమోహన్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.
