గాంధారి, బతుకమ్మ : శ్రీశ్రీశ్రీ కోదండరామ చంద్రస్వామి విగ్రహాల ఊరేగింపును శనివారం గాంధారి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. విగ్రహాల ప్రతిష్టాపన త్వరలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి త్వరలో తేదీని ప్రకటిస్తారని తెలిపారు. ఆయన ఆదేశానుసారంగా విగ్రహాలను తిప్పారం తాండ గ్రామంలో చేరవేయడం జరిగిందని తెలిపారు. మండల ప్రజలు, తిప్పారం తండా లబాన ప్రజల సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ బాపురావు స్వామీజీ, తాన్ సింగ్, బిషయంలాల్, గంగారం, పెంటయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
