ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలో గల అతి ప్రాచీనమైన లక్ష్మణ రహిత శ్రీ సీతా రామ చంద్ర స్వామి దేవాలయ రాజగోపుర నిర్మాణానికి సుమారుగా 25 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ,వివిధ కులసంఘాలు, నాయకులు, గ్రామంలోని విద్యావంతులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందల్వాయి గ్రామానికి ఆలయ అభివృద్ధికి మున్ముందు నిధులు సమకూర్చి అభివృద్ధిలో ఉంచాలని ఎమ్మెల్యేను కోరారు. గత ప్రభుత్వంలో రామాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినప్పటికీ ఇప్పటివరకు నయా పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభివృద్ధికి పునాది లాంటిదని అన్నారు. రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. రామాలయానికి నిధులు మంజూరు చేయడంలో వీడీసీ కమిటీ,పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కృషివల్లనే నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి గ్రామ విడిసి చైర్మెన్ మహేందర్, వీడీసీ కమిటీ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఎడపల్లి ముత్తన్న,పార్టీ అధ్యక్షుడు ఈర్ల సాహేందర్,మాజీ అధ్యక్షులు, మాజీ ఆయకట్టు చైర్మన్, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.