జీజీహెచ్ లో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిజిహెచ్ లో జరుగుతున్న తప్పిదాలపై విచారణ చేపట్టి, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా జీజీహెచ్ పై చర్యలు తీసుకోవాలని బీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య డిమాండ్ చేసారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహేచ్) కి సంబంధించిన మాతశిశు సంరక్ష కేంద్రం, క్రిటికల్ కేర్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న...