Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 9:14 pm Posted by : ramakrishna

సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలి

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. ప్రజావాణి  కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల ఎస్ఐ, సిఐ లకు సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.  ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని పేర్కొన్నారు.