బహుజన కాలనీలో సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని బహుజన కాలనీలో తాగునీరు, మురికాలువలు, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నగర కార్యదర్శి బి సుజాత డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. నాగారం 80 క్వార్టర్స్ లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారులతో మొరపెట్టుకుంటున్నా శ్మశాన వాటికకు నిదులు కేటాయించలేదని, ఇప్పటికైనా పనులను ప్రారంభించాలని కోరారు. అలాగే దొడ్డి కొమురయ్య నగర్ కు సంబంధించి తాగునీటి, మురికి కాలువల సమస్యలను...