ఏర్గట్ల, బతుకమ్మ :
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయి లో పాఠశాల విద్యార్థులకు సైన్స్ ఫిక్షన్ కథల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రెండు రాష్ట్రాల నుండి సుమారు 350 కథలు రాగా దీనిలో నుండి 15 ఉత్తమ కథలను తీసుకొని వాటికి బహుమతులను ప్రకటించారు. దీనిలో ఏర్గట్ల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కే.అభిలాష్ రాసిన కథ వేరే గ్రహంలో జీవనం అనే కథకు, పి.రాజేష్ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి రాసిన సౌర కుటుంబంలో జీవనం అనే కథకు బహుమతులు లభించాయని, పాఠశాల తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్న విద్యార్థులను పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి అభినందించారు. వీరికి త్వరలోనే నగదు బహుమతిని, ప్రశంసా పత్రాలను అందజేస్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మునిరుద్దీన్, ప్రసాద్, శ్రీనివాస్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, గంగాధర్, గంగా మోహన్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.