Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 12:44 pm Posted by : ramakrishna

ఆగి ఉన్న లారీ ఢీకొన్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు

నిజామాబాద్, బతుకమ్మ  :  డిచ్​పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్​ జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.   బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్​ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్​ అజాగ్రత్త నడపడంతో సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది.  ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్​పల్లి ఎస్సై షరీఫ్  ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.