. . . పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం పిడిఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ డిస్ట్రిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 840 పైగా ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఉన్నాయని, అందులో 150 పైగా బస్సులు ఫిట్ నెస్ రెన్యువల్ చేయించకుండా నడుపుతున్నారని, విద్యా సంవత్సరం ప్రారంభమైన బస్సులు ఫిట్ నెస్ లేకుండా నడపడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేనని, వందల సంఖ్యలో ఆటోలు, టాటా మ్యాజిక్ లు ఫిట్ నెస్ లేకుండా నడుపుతున్నారని, ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులో పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారని, గతంలో అనేక బస్సులు, ఆటోలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని, కావున ఫిట్ నెస్ లేని బస్సులను, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు భవాని, శ్రీకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు.