ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

నందిపేట్, బతుకమ్మ :  ట్రాన్స్ ఫార్మర్ వద్ధ కరెంటట్ పనులు చేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్  కరెంట్ షాక్ తో  మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం నందిపేట్ మండలం వన్నేల్( కే) మారంపల్లి రోడ్డులోని ఎర్రగుంట చెరువు వద్ద జరిగింది. నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దంతాల రాజేంధర్ గత 15 సంవత్సరాలుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. మండలంలోని మూడు గ్రామాలలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా విద్యుత్ శాఖ అధికారులతో పాటు, స్థానిక గ్రామాల రైతులకు, ప్రజలకు సుపరిచుతుడు. ఆదివారం...