Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2024, 10:50 am Posted by : ramakrishna

ప్రైవేట్ డిగ్రీ, పిజీ  కళాశాలల బంద్

ఫీజు రియెంబర్స్ మెంట్ బకాయిల కోసం …

 . . . నిరవధికంగా బంద్ ప్రైవేట్ డిగ్రీ, పిజీ  కళాశాలల బంద్

 నిజామాబాద్, బతుకమ్మ:

మూడు సంవత్సరాల  పీజు రియెంబర్స్ మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యాయి. సోమ వారం నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేసి నిరసనకు పిలుపు నిచ్చారు. 14 న ఉదయం నుంచి కళాశాలలను మూసి వేశారు.ప్రభుత్వంకు తమ సాధక బాదలు చెప్పుకున్న స్పందించకపోవడంతో ఈ నెలలో తెలంగాణ విశ్వవిద్యాలయం అకాడమీక్ అడిట్ సెల్ డైరెక్టర్ కు నిరవధికంగా కళశాలల మూసివేత నోటిస్ లను అందచేసిన యాజమాన్యాలు దసరా సెలవుల తరువాత విద్యాసంస్థలను మూసివేసి నిరసన తెలుపుతున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్, అధిలాబాద్ జిల్లాలో  54 డిగ్రీ, 20 పీజీ కాలేజీలు ఉన్నాయి. స్టేట్ లో రూ.1500 కోట్ల బకాయిలు ఉన్నాయని కనీసం ఓక విడతలో రూ.300 కోట్లు ఐనా ప్రభుత్వం విడుధల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మెనేజ్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షలు అంబోజీ హరి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. ఇది వరకు యాజమాన్యాలు ఇందిర పార్క్ వద్ధ నిరసన తెలిపిన,    మంత్రులకు విన్నవించిన తమ సమస్య పరిష్కరం కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

Private Degree, PG  Colleges Band