ప్రాక్టికల్స్ ను బహిష్కరించిన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 16 నుండి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై నిరసనను తెలిపాయని అన్నారు. దాంట్లో భాగంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘ ప్రతినిధుల ద్వారా కళాశాలల ఇబ్బందులను, గోడు ను విన్నవించామన్నాయి. దానితోపాటు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడా పలుమార్లు చర్చలు జరిపినా...