Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 6:09 pm Posted by : ramakrishna

ప్రాక్టికల్స్ ను బహిష్కరించిన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఈనెల 16 నుండి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం  సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై నిరసనను తెలిపాయని అన్నారు. దాంట్లో భాగంగా పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంఘ ప్రతినిధుల ద్వారా కళాశాలల ఇబ్బందులను, గోడు ను విన్నవించామన్నాయి.  దానితోపాటు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కూడా పలుమార్లు చర్చలు జరిపినా గాని ఫలితం మాత్రం శూన్యం అని తెలిపాయి.  రియంబర్స్మెంట్ విషయంలో వారు చేస్తున్న జాప్యం  వలన ప్రైవేట్ కళాశాలల అద్దె చెల్లించలేక, లెక్చరర్ ల జీతభత్యాలు ఇవ్వలేక యాజమాన్యాల బ్రతుకులు అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి పట్ల నిరసిస్తూ ఏమి చేయాలో తెలియని దయాన స్థితిలో బహిస్కరణనే మార్గమని నిర్ణయించుకున్నామని తెలిపాయి. అందుకు గాను  ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మా కళాశాలలో ఈనెల 16 నుండి జరిగే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నామని తెలిపాయి.