ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందా..?

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రైవేటు దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది.విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైంది. అటువంటి వృత్తిలో ఉన్న టీచర్లకు, లెక్చరర్లకు సమాజంలో గౌరవ మర్యాదలకు ఏ మాత్రం కొదవ లేదు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ టీచర్లు అంటే ప్రత్యేక గౌరవం తో పాటు స్థానికంగా నైనా.. వారు పని చేసే చోట అయినా అపార నమ్మకం, గౌరవ మర్యాదలు లభిస్తాయి. అటువంటి ఉన్నత ఉద్యోగంలో...