Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 9:51 pm Posted by : ramakrishna

డ్రమ్ములను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

  • మద్యం మత్తులో డ్రైవర్

 

బతుకమ్మ, భిక్కనూరు : మద్యం మత్తులో ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామం వద్ద వేగ నియంత్రణ కోసం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసినవేగ నియంత్రణ కోసం డ్రమ్ములను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపుగా 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉండగా విషయం తెలుసుకున్న భిక్కనూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 350 గా నమోదయింది. దీంతో ప్రయాణికులను మరొక బస్సులో తరలించి బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని బస్సు ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Private bus hits drums