- సత్పర్వర్థనతో సత్పలితాలు
- జైల్ అదాలత్ లో 38 కేసుల పరిష్కారం
- జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్థిక, సామాజిక పరిస్థితులు మనుషుల మనసులను మార్చివేసి నేరానికి పురికొల్పుతాయని, వాటిని అదిగమించి సామాజినికి ఆదర్శనంగా నిలవాలని నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్ ఖైదీలకు ఉద్భోదించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్ర కారాగారంలో శనివారం నిర్వహించిన జైల్ అదాలత్ లో ఆయన ముఖ్యఆతిథిగా పాల్గొని జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఖైదీలు, న్యాయస్తానాల ద్వారా శిక్షకు గురైన ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజీపద్దతిన 38 క్రిమినల్ కేసులను పరిష్కరించారు. సత్పర్వతనతో సత్పలితాలు సిద్దిస్తాయని, వాటి కోసం శ్రమించాలని అన్నారు. తెలిసి చేసిన, తెలియక చేసిన నేరం నేరమేనని ఆయన తెలిపారు. కోర్టుల ద్వారాశిక్షలకు గురైన ఖైదీలు మంచి మార్పుకోసం ప్రయత్నించాలని పేర్కొన్నారు. ఒకరి ఆస్థిని, మరొకరి జీవనశైలిని అడ్డుకునే హక్కులు ఎవరికి లేవని, వేరొకరిని గాయపరచి నష్టం చేస్తే చట్టం ఊరుకోదని అన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉంటేనే న్యాయస్తానాలు శిక్షలు విదిస్తాయని ఆయన వివరించారు. స్వేచ్ఛగా జీవించాలని, ఇతరుల స్వేచ్ఛను హరించారాదనీ అన్నారు. విశాలమైన ప్రపంచంలో విహరించానే కాని నేరాలు చేసి నాలుగు గోడల మధ్య నివసిస్తే దానికి విలువ ఉండదని తెలియజేశారు. జైలు అనే దానిని ఒక ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుకుని విద్య, ఉపాధి అవకాశాల ఘనిగా ఊయోగించుకోవాలని జడ్జి హరి కుమార్ సూచించారు. సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించాలని, సమాజ ప్రగతి పాటు పడాలని ఆయన ఖైదీలకు తెలిపారు. జైల్ సువరింటెండెంట్ చింతల దశరథం మాట్లాడుతూ జైలులో అందరిని కుటుంబ సభ్యులుగానే చూస్తామని, ఎవరిపట్ల వివక్ష చూపమని, సమానతే మా అభిమతమని అన్నారు.జైలు అనేది ఇంటి వాతావరణాన్ని, సభ్య సమాజం మధ్యలో జీవిస్తున్నామనే పరిస్థితులను కలిగిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జైలర్ ఉపేందర్ రావు, డిప్యూటీ జైలర్ మన్మత్ రావు తదితరులు పాల్గొన్నారు.