Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 5:32 pm Posted by : ramakrishna

నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ప్రాధాన్యత

  • జిజి. కళాశాలలో  “కామర్స్, ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు ఓరియంటేషన్” కార్యక్రమం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భవిష్యత్తులో ఇటువంటి నైపుణ్యాభివృద్ధితో ముడిపడిన కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని జీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అకాడమిక్ సెల్  ఆధ్వర్యంలో గురువారం  ఫిజికల్ సైన్స్, విద్యార్థులకు, కామర్స్ విభాగం విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో కొత్త కోర్సులు బి. ఎఫ్.ఎస్.ఐ., హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి.. గనుక  అకాడమిక్ కార్యకలాపాలతో పాటు అప్రెంటిషిప్ కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనాలని సూచించారు. కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం,  మాట్లాడుతూ విద్యార్థులు  సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయడమే కాదు, స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోవాలని,    సమయపాలన, చక్కని ప్రణాళికతో  విజేతలు అవుతారని అన్నారు. కామర్స్ విభాగం అధిపతి  వినయ్ కుమార్ మాట్లాడుతూ, కామర్స్ విద్యార్థులకు ప్రపంచమంతా ఉద్యోగావకాశాలు  ఉన్నాయని, వాటిని అందుకునెట్టుగా కళాశాల సౌకర్యాలు ఉపయోగించుకొని తమ నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలన్నారు.  బి.బి.ఏ.అధిపతి డాక్టర్ రంజిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కళాశాల కార్యక్రమాలను, నియమ నిబంధనలను వివరించారు. పరీక్షల నియంత్రణాధికారి  భరత్ రాజ్ పరీక్షల  నిబంధనలను వివరించారు. అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం,రాహుల్, వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో   ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి,   విద్యార్థులను ఉల్లాసపరుస్తూ గీతాలను ఆలపించారు. పి.డి. డాక్టర్  బాలమణి, ఎన్.సి.సి. అధికారి  లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, డాక్టర్ పి.రామకృష్ణ, డాక్టర్ జయప్రసాద్, రజిత, సుమన్, శ్రీనివాస్, సతీష్, సంతోష్, ప్రియాంక, డాక్టర్ శమంత తదితర అధ్యాపకులు,  విద్యార్థులు  పాల్గొన్నారు.

Priority will be given to courses related to skill development.