Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 10:42 pm Posted by : ramakrishna

వడ్డెరులకు ప్రాధాన్యత కల్పించాలి

  • జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్

 

బతుకమ్మ, బాన్సువాడ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర కులస్థులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు శివ ప్రభుత్వాన్ని కోరారు. బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్లో గురువారం వడ్డెర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడిగా పిట్ల శ్రీధర్, రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లపు శివ, యువజన సంఘం జాతీయ అధ్యక్షుడిగా వేముల భరత్ ఎన్నిక య్యారు. వడ్డెర సంఘం నాయకలు కుంచాల ఏడుకొండలు, లోకనాథం, బత్తుల లక్ష్మికాంతయ్య, వల్లపు మొగిలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ వారికి నియామకపత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ.. వడ్డెరులకు సామాజిక, రాజ కీయ రంగాలలో తగిన ప్రాదాన్యత కల్పించా లని వారు డిమాండ్ చేశారు. నాయకులు.. గోపాల్, నర్సింహ, గుర్రాజ్, ఎల్లయ్య, రమేష్, శేఖర్, వెంకటస్వామి, గణేష్, శేఖర్, స్వామి, రాములు, యాదయ్య, నాగరాజు, శ్రీనివాస్, వెంకటన్న పాల్గొన్నారు.

Priority should be given to elders