విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని విద్యలో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. విద్యను సమాజ అభివృద్ధికి మూలస్తంభంగా భావిస్తూ, నియోజకవర్గవ్యాప్తంగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.3.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) నిర్మాణ పనులను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్‌లు, అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల పురోగతిని...