భక్తితో పాటు భద్రతకు పెద్దపీట
. . . కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.హెల్మెట్ ధరించిన వినాయకుడితో కామారెడ్డి పోలీసులు వినూత్న అవగాహనకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ మండపాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి అనే సందేశంతో రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే.. సురక్షితంగా ఇంటికి చేరండి అని...