ఆర్మూర్, బతుకమ్మ :
వడ్ల, జొన్న, మొక్క జొన్న లాంటి దినుసులకు మద్దతు ధర పెద్ద ఎత్తున పెంచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ చిత్ర పటానికి పాలాభేషేకం నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీలోని కిసాన్ మోర్చా నాయకుడు చిట్టి భజన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. నూతల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని 2013 కు ముందు వడ్లకు 1310 ఉంటే ఈరోజు వడ్లకు 2461 పెంచడం జరిగిందన్నారు. వడ్లతో పాటు మొక్కజొన్న, జొన్న, సన్ ఫ్లవర్, మినుములు, పప్పు, దినుసులు ఇవన్నీటికీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ధరలు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లయ్య, పోశెట్టి, నరసయ్య, గంగన్న, పోతన్న, రాజు, రైతులు పాల్గొన్నారు.