రుద్రూర్, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం, మొక్కలు నాటు కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపట్టినటువంటి 11 సంవత్సరాలలో అభివృద్ధిని పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రైతులు పండించే 12 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచడం, కిసాన్ సమ్మాన్ నిది, ఫసల్ బీమా యోజన, పీఎం గ్రామ సడక్ యోజన ఆర్టికల్ 370, ఆపరేషన్ సిందూర్, ఆయుష్మాన్ భారత్, నారీ శక్తివంతం, మాతృ వందన యోజన, విశ్వకర్మ యోజన, నరేంద్ర మోదీ దేశ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక పథకాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ఓబీసీ మండల అధ్యక్షులు, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల సీనియర్ నాయకులు పార్వతీ మురళి గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ మండల కోశాధికారి రామ్ రాజు గారు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, శ్రీనివాస్, అనిల్, సాయికుమార్, కే.గణేష్, నాగయ్య, మండల పదాధికారులు, శక్తి కేంద్ర ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.